Home  »  TV News  »  Podharillu: చక్రితో రిసెప్షన్ కోసం రెడీ అయిన మహా.. మాధవ హ్యాపీ!

Updated : Feb 6, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు(Podharillu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-44 లో.. మహా తన గదిలో ఉండగా చక్రి లోపలికి వచ్చి రిసెప్షన్ కి రెడీ అవ్వమని చెప్తాడు. నేను రాను.. మీ వాళ్ళకి అసలు నిజం ఎందుకు చెప్పలేదని మహా అంటుంది. ఇప్పుడు చెప్పే సిచువేషన్ లేదు.. మీరు ఈ ఒక్కసారి నా మాట వినండి అని చక్రి రిక్వెస్ట్ చేస్తుంటాడు‌. కానీ తన మాట వినదు. ఇదంతా ఇష్టం లేదని మీ వాళ్ళతో చెప్తానని చక్రితో మహా అంటుండగా మాధవ వస్తాడు.

ఏమైందమ్మా అని అడుగుతాడు. అదేం లేదు అన్నయ్య.‌ వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాలేక అని చక్రి ఏదో చెప్పబోతుంటే అది కాదు అని మహా కోపంగా అంటుంది. దాంతో మాధవకి విషయం అర్థమవుతుంది. మీరు మా ఇంటికి మహాలక్ష్మిలాగా వచ్చారు. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు.. ఏమైనా ఇబ్బంది కల్పించామా అని మాధవ అడుగుతాడు. అదేం లేదు.. నాకు ఈ రిసెప్షన్ జరుపుకోవడం ఇష్టం లేదు.. అసలు మా పెళ్ళి ఏ పరిస్థితిలలో జరిగిందోనని మహా మొత్తం చెప్తుంది. తనకి ఇష్టం లేని పెళ్ళిని చేస్తుంటే మీ తమ్ముడు నన్ను సేవ్ చేశాడు. ఇక ఆ తర్వాత రౌడీలు వెంబడించారు.. మేము ప్రాణాలు కాపాడుకోవడానికి  స్టేషన్ లోకి వెళ్తే అక్కడ మా పెళ్ళి జరిగిందని అక్కడ జరిగింది మొత్తం మాధవతో మహా చెప్తుంది. దాంతో మహా ఎమోషనల్ అవుతాడు. ఈ విషయం తెలియకుండా మిమ్మల్ని అడుగకుండా మేము తొందరపడి ఈ రిసెప్షన్ ఏర్పాటు చేశాం.. తప్పు మాదే.. మాకు ఇది అలవాటే.. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మీ ఇద్దరిని ఆశీర్వదించడానికి రాలేదు.. ఈ ఇంట్లోకి వచ్చిన ఆడపిల్ల ఉంటుందా ఉండదా‌‌.. అసలు ఎలా ఉంటుందో చూడటానికి వచ్చారంటూ వారు ఎదుర్కొన్న కష్టాలని చెప్తూ మాధవ ఎమోషనల్ అవుతాడు.

నువ్వు ఇక్కడ ఉండొద్దు.. రిసెప్షన్ కి రావొద్దు.. ఇది జరగదని చెప్పేస్తానని మహాతో చెప్పి మాధవ బయటకు వస్తాడు. ఇక ఫంక్షన్ కి వచ్చినవాళ్ళంతా ఏం జరుగుతుందా అని ఎదురుచూస్తుంటారు. ఇక మాధవ స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ పట్టుకొని ఎమోషనల్ ఏదో చెప్పాలనుకుంటాడు. అంతలోనే మహా రెడీ అయి బయటకు వస్తుంది. దాంతో అంతా షాక్ అవుతారు. మాధవ, చక్రి, కేశవ, కన్నా హ్యాపీగా ఫీల్ అవుతారు. సారీ పెద్ది.. రావడానికి కాస్త లేట్ అయిందని మాధవతో మహా అనగానే సరే అన్నట్టుగా మాధవ నవ్వుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.